శ్రీ భువనేశ్వరి పీఠము

శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠాధ్యక్ష శ్రీ జగద్గురు శ్రీశ్రీశ్రీ కల్యాణానంద భారతి మహాస్వామి పరంపరా సముల్లసిత శ్రీభువనేశ్వరి పీఠంలో ప్రతినిత్యం ఉదయం - శ్రీచక్ర పూజ లలితా సహస్రనామములతో కుంకుమార్చన; సాయంత్రం - శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమార్చన; ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి - శ్రీచక్ర నవావరణార్చన; ప్రతి సోమవారము మరియు మాస శివరాత్రి - శ్రీ రుద్రమండలమునకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము జరుగుతున్నవి. భక్తులందరికి స్వాగతం.


పై పూజా కార్యక్రమములలో మీ యొక్క గోత్రనామములతో పూజ జరిపించుకొనుటకై

శుక్రవారము లేదా పౌర్ణమినాడు - శ్రీ చక్ర నవావరణార్చనకు;

సోమవారము లేదా మాస శివరాత్రినాడు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకమునకు;

ప్రతినిత్యం జరుగు అమ్మవారి పూజకు కుంకుమార్చనకు;

శ్రీ చండీ హోమము, శ్రీ లక్ష్మీ గణపతి హోమము, ఆయుష్ హోమము, నవగ్రహ హోమము,

నాగ పూజ, పంచముఖ ఆంజనేయ పూజ/అభిషేకము, తదితర పూజలు, హోమములకు నిర్దేశించిన పూజా రుసుము చెల్లించి మీ గోత్ర నామాలు నమోదు చేయించుకోగలరు. హోమ ద్రవ్యములు కర్త ఏర్పాటు చేయవలెను. కార్యక్రమములో మీరు సకుటుంబముగా పాల్గొనటం అభిలషణీయము. వివరముల కొరకు అర్చకులు - మల్లేశ్వర శర్మగారిని సంప్రదించగలరు - ఫోన్ : +91 90002 13949 - sbp.info2023@gmail.com


శ్రీ చిదానంద ఆశ్రమం, కేసరపల్లి పోస్ట్, గన్నవరం – 521102 విజయవాడ విమానాశ్రయం ఎదురుగా


Instamojo

Want to create landing pages for your business? Visit Instamojo Smart Pages and get started!